కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణలో పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసాగా నిలిచిన కళ్యాణ లక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి (Dasari Manohar Reddy) అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం పెద్దపల్లి (Peddapalli) కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా (BRS Protest) లో ఆయన మాట్లాడారు.
ఈ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఎంతోమంది ఆడబిడ్డల వివాహాలకు గత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సహాయం అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం అందించే సహాయం ఆలస్యం కావడం వల్ల కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజకీయాలకు అతీతంగా పేద ఆడబిడ్డల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పథకాలను నిరంతరాయంగా కొనసాగించాలని కోరారు. జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కోరారు.
పేద ఆడబిడ్డల వివాహాలకు భరోసాగా నిలిచిన ఈ పథకాలను నిర్వీర్యం చేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ప్రజాఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తూ అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం(BRS Protest)లో మాజీ టీఎస్ చైర్మన్ రాకేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Also Read : రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న ‘క్షుద్రపూజలు’
Follow Us On : WhatsApp

