కల్యాణ లక్ష్మి, షాదీ‌ ముబారక్ పథకాలు కొనసాగించాలి: గద్వాల బీఆర్ఎస్

కలం, జోగులాంబ గద్వాల: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ పార్టీ గద్వాల (Gadwal BRS) నియోజకవర్గ ఇంచార్జీ‌ బాసు హన్మంతు నాయుడు విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సోమవారం గద్వాల‌ జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున దర్నా చేపట్టారు. అనంతరం పాతబస్టాండ్ నుంచి గద్వాల ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్రగా‌ వెళ్లి అక్కడ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన వ్యక్తం చేశారు.

ఆనాడు కేసీఆర్ పథకాన్ని తీసుకొచ్చారు..

అనంతరం ఆర్డిఓ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాసు హన్మంతు మాట్లాడుతూ.. నూరు అబద్దాలైన ఆడి ఒక పెళ్లి చేయాలని ఆనాడు పెద్దలు నానుడి అంటూ ఉండేవారని గుర్తు చేశారు. పేద ఇంటి పిల్లలకు పెళ్లి చేయడానికి కన్న తల్లిదండ్రులు పడుతున్న తాపత్రయం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 2014లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 51 వేల రూపాయల పారితోషకంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి బృహత్తరమైన పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అలాగే పేదల అవసరాలకు అనుగుణంగా వారి ఇబ్బందులు గుర్తించి వాటిని లక్ష రూపాయలకు పైగా కేటాయించారని అన్నారు.

కాంగ్రెస్ కుట్ర పన్నుతోంది..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నో ప్రగల్బాలు పలికారని విమర్శించారు. రెండున్నర సంవత్సరాలుగా పాలన కొనసాగుతున్నా.. తులం బంగారం ఇవ్వకపోగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి బృహత్తర పథకాలను ఎత్తివేసేందుకు రేవంత్  సర్కార్ కుట్ర పన్నుతొందని ఆయన ఆరోపించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిషేధించే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మానుకోవాలన్నారు.

ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం..

ఆ పథకాలను నిషేధిస్తే పేదింటి ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నాదని.. పథకాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనియెడల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఆడబిడ్డలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, మాజీ జెడ్పీటిసి బాసు శ్యామల, నాయకులు రాఘవేంద్రరెడ్డి, ప్రతాప్, కోటేష్, గంజిపేట రాజు, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : గాంధీభవన్‌లో సామాజిక వర్గాల రగడ… క్రమ‘శిక్ష’ణలో వివక్ష!

Follow Us On: Instagram

మహబూబ్ నగర్ వార్తల కోసం క్లిక్ చేయండి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>