బీజేపీ కొత్త కార్యవర్గం ప్రకటన

కలం, వెబ్ డెస్క్: బీజేపీ కొత్త కార్యవర్గాన్ని జాతీయ అధ్యక్షుడు నితిన్ నభిన్ (Nitin Nabin) ప్రకటించారు. జనరల్ సెక్రటరీలుగా వినోద్ తావ్డే, స్మృతి ఇరానీ ఎంపికయ్యారు. 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. వీరిలో ఏపీకి చెందిన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, రాంమాధవ్‌కు చోటు లభించింది. వీరితో పాటు వసుంధర రాజే సింధియా, తిరథ్ సింగ్ రావత్, బైజయంతి జే పాండా, వర్షబెన్ నరేంద్రభాయ్ దోషి, మన్ ప్రీత్ సింగ్ బబాద్, లాల్ సింగ్ ఆర్య, ఎం.నాగరాజ, తారీఖ్ మన్సూర్, మధు చంద్రఖర్, రేఖా వర్మ, భర్తి ప్రవీణ్ పవార్‌ను నియమించారు. పీయూష్ గోయల్ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. ఇక అత్యంత కీలకమైన పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా బి.ఎల్.సంతోష్‌ను కొనసాగించారు. కేంద్ర కార్యాలయం ఇన్‌ఛార్జిగా తరుణ్ చుగ్ ఎంపికయ్యారు.

ముగ్గురు ఏపీ నేతలకు పదవులు..

బీజేపీ జాతీయ కార్యవర్గంలో ముగ్గురు ఏపీ నేతలకు పదవులు దక్కాయి. వారిలో పురందేశ్వరి, రాంమాధవ్‌కు జాతీయ ఉపాధ్యక్షులుగా, విసష్ణువర్ధన్ రెడ్డికి జాయింట్ కో–ఆర్డినేటర్‌గా చోటు లభించింది. అయితే తెలంగాణ నుంచి ఈసారి ఎవరికి చోటు ఇవ్వకపోవడం గమనార్హం. ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్ వ్యవహరించగా.. తాజాగా ఆయన స్థానంలో యూపీకి చెందిన అమర్ పాల్ మౌర్యను నియమించారు. అంతేగాకుండా జాతీయ కార్యవర్గం నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు కె.లక్ష్మణ్, డీకే.అరుణను తొలగించారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>