రాజురలో శ్రీ రామాలయానికి మహర్దశ.. రూ. 40 లక్షలతో పునర్నిర్మాణం!

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా లోకేశ్వరం మండలం రాజుర గ్రామంలో శ్రీ రామాలయ పునర్నిర్మాణ పనులకు ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పవార్ రామారావు మాట్లాడుతూ.. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన సీజీఎఫ్ నిధులు రూ. 40 లక్షలతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రజల విశ్వాసానికి ప్రతీకలైన ఆలయాల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. అనంతరం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>