కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మండలాల్లో ప్రజావాణి (Nizamabad Prajavani) కార్యక్రమం మొదలైంది. నిజామాబాద్ జిల్లాలోని 34 మండలాల్లో కామారెడ్డి జిల్లాలోని 24 మండలాల్లో అంతటా ప్రజావాణి జరిగింది. మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీడీవోలు వినతులు స్వీకరించారు. సమస్యలు ఉన్న వారు, భూ వివాదాలు ఉన్న వారు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి వినతిపత్రాలు అందించారు. ఇన్నాళ్లు జిల్లా కలెక్టరేట్ల చుట్టూ ప్రజావాణికి తిరిగి ఇప్పుడు మండలాలకు మారే సరికి సమస్య మళ్ళీ కొత్తగా అయిపోయినట్టయ్యింది. సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పటికైనా జాప్యం జరగకుండా సమస్యలు పరిష్కరించాలని జనాలు కోరుతున్నారు.

