ఇలేగాంలో పోలీసుల ‘కార్డన్ సెర్చ్’.. భారీగా వాహనాలు స్వాధీనం

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా (Bhainsa) మండలంలోని ఇలేగాం గ్రామంలో ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం ‘కార్డన్ సెర్చ్’ (Cordon Search) నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన ధ్రువ పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్‌ (Cordon Search) లో భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, రూరల్ ఎస్సై ప్రియాంక, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : న్యూయార్క్‌లో ఇండియా డే ప‌రేడ్‌.. పూజా హెగ్డే డ్యాన్స్!

Follow Us On: Instagram

ఆదిలాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>