ప్రధాని మాటతో మరో కొత్త పార్టీ.. సోషల్ మీడియాలో సంచలనం!

కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్స్’ అనే పదాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. మావోయిస్టులు అంతమైపోయారని, కానీ అదే భావజాలంతో దేశంపై కుట్రలు చేసే మేధావులను దిమాగీ నక్సల్స్‌గా పేర్కొన్న మోదీ.. ఇక నుంచి వారి సంగతి చూడాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ‘దిమాగీ నక్సల్ పార్టీ’ (Dimagi Naxal Party) అంటూ కొత్త పేజీలు పుట్టుకొస్తుండటం సంచలనంగా మారింది.

ఇది మరో కాక్రోచ్ జనతా పార్టీగా మారుతుందా..? అనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటికే ఎక్స్‌లో ‘దిమాగీ నక్సల్ పార్టీ’ అంటూ ఓపెన్ చేసిన పేజీకి రెండు వేల మంది ఫాలోవర్లు వచ్చారు. బయోలో వ్యవస్థాపకుడి పేరును ‘వన్ దిమాగీ ఇండియన్’ అని పేర్కొనడం గమనార్హం. ఇన్ స్టాలో కూడా కొత్త పేజీలు క్రియేట్ చేసి, మోదీ ఇతర కేంద్ర మంత్రుల ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ.. సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రధాని ఉద్దేశం అది కాదు…

ప్రధాని మోదీ వాడిన దిమాగీ నక్సల్స్ అనే పదంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ హోం మంత్రి పి.చిదంబరం మొదటగా స్పందిస్తూ.. తాను దిమాగీ నక్సల్‌గా ఉండటాన్ని గర్వపడుతానంటూ కామెంట్ చేసి రాజకీయాలను మరింత హీటెక్కించారు. ఆయనకు పలువురు పార్టీ నేతలు కూడా జతకలిశారు. తాము కూడా దిమాగీ నక్సల్స్ అంటూ పోస్టులు పెట్టారు.

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై కుట్రపూరితంగా వ్యవహరించేందుకు ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు. వారికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. కేవలం మావోయిస్టులు, వేర్పాటువాదులను ఉద్దేశించి మాత్రమే ప్రధాని ఆ పదం ప్రయోగించారని, ఏ ఒక్కరి పేరు కూడా ప్రస్తావించలేదన్నారు. కాంగ్రెస్ నేతలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని మండిపడ్డారు. మొత్తంగా దిమాగీ నక్సల్ అనే పదం రాజకీయంగా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>