గద్వాల జిల్లా వ్యవసాయ శాఖకు రాష్ట్ర స్థాయి గుర్తింపు

కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా వ్యవసాయ శాఖ పని తీరుకు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా వ్యవసాయ శాఖ తరఫున రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారాన్ని డైరెక్టర్ డాక్టర్ బి.గోపి చేతుల మీదుగా అందుకున్నట్లు చెప్పారు.

రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడంలో అధికారులు, సిబ్బంది చేసిన కృషికి ఈ అవార్డు గుర్తింపుగా నిలిచిందన్నారు. కలెక్టర్ సహకారంతో మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల కృషి వలన ఈ గుర్తింపు సాధ్యమైందని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>