రేపటి నుంచే భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఏవీయేషన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భోగాపురం ఎయిర్‌పోర్టు (Bhogapuram Airport) రేపటి నుంచే ప్రారంభం కానుంది. ఇప్పటివరకు సేవలు అందిస్తూ వస్తున్న విశాఖపట్నం విమానాశ్రయం ఈ రోజు అర్ధరాత్రితో మూతపడనుంది. ఎయిర్‌పోర్ట్‌ను తూర్పు నావికా దళం ఆధీనంలోకి తీసుకుంది.

ఇక్కడ ఎమర్జెన్సీ విమానాలు, ప్రముఖులవి మాత్రమే ల్యాండ్ కానున్నాయి. ప్రయాణికుల విమానాలు ఇక నుంచి పూర్తిగా భోగాపురం నుంచే ఆపరేట్ కానున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించగా.. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలోనే కాకుండా దేశంలోనే అత్యంత పొడవైన రన్ వే ఉన్న విమానాశ్రయంగా ఇది రికార్డు సాధించింది.

నేరుగా మెట్రో నిర్మాణం..

భోగాపురం ఎయిర్‌పోర్టు (Bhogapuram Airport) రేపటి నుంచి ప్రారంభం కావడం ఏపీకి మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు గర్వకారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ అన్నారు. విమనాశ్రయం రాకతో ఇక్కడ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. భవిష్యత్తులో విశాఖపట్నం నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో నిర్మాణం జరగబోతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే విమానాశ్రయ నిర్మాణం వేగంగా జరిగిందన్నారు.

Also Read : వందేమాతరం వివాదం: సోనియాపై అమిత్ షా ఫైర్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>