కలం, వెబ్ డెస్క్: జార్ఖండ్(Jharkhand) లోని లతేహర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన కంటైనర్ ట్రక్కు సృష్టించిన బీభత్సంలో ఓ చిన్నారితో సహా ఆరుగురు దుర్మరణం చెందారు. లతేహర్ జిల్లాలోని చంద్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదకర ఘటన జరిగింది. ఓ కంటైనర్ ట్రక్కు అత్యంత వేగంగా వెళ్తూ అకస్మాత్తుగా అదుపుతప్పింది. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఆటో రిక్షాతో పాటు ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. ఆటో, బైక్‌పై ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఒక చిన్నారి కూడా ఉండటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని సమీప ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
Also Read : అలిపిరి మెట్లపై ధూమపానం.. టీటీడీ సీరియస్
Follow Us On: X(Twitter)

