రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!

కలం, వెబ్ డెస్క్ : సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ (AP Assembly) వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు అమరావతిలోని వెలగపూడిలో జరిగే సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులు, చట్టాల సవరణలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు దిశ చట్టం ఉపసంహరణ, దానికి ప్రత్యామ్నాయంగా తీసుకురానున్న బిల్లులపై కూడా సభలో చర్చ జరగనుంది.

రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన డీఎస్సీ అంశం కూడా అసెంబ్లీ (AP Assembly) సమావేశాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన అంశాలు, నిరుద్యోగుల సమస్యలు, విద్యా రంగానికి సంబంధించిన విషయాలపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితి, అక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలు సాగునీటికి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Also Read : శ్రీశైలానికి వరద ప్రవాహం: జూరాల నుంచి ఇన్‌ఫ్లో!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>