కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ (Iran) ను పూర్తిగా ఓడించిన తర్వాత… త్వరలోనే హర్మూజ్ జలసంధిని (Hormuz Strait) అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదో వంత కలిగిన హర్మూజ్ జలసంధి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. హర్మూజ్‌ను మూసేయాలా? తెరవాల? అనేది తమ నిర్ణయేమని, హర్మూజ్‌ను ఎవరూ ఆక్రమించుకోలేరని తెలిపింది. యుద్ధ నౌకల మోహరింపుతో భయపడేది లేదని అమెరికాకు హెచ్చరిక జారీ చేసింది.
మరోవైపు అమెరికాతో హర్మూజ్ జలసంధిపై వివాదం కొనసాగుతున్న వేళ ఒమన్ దేశంతో ఇరాన్ (Iran) కీలక ఒప్పందం చేసుకుంది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు సురక్షిత మార్గం కల్పించే అంశంపై ఒమన్, ఇరాన్ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. హర్మూజ్‌ను తమ భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ చేసిన వ్యాఖ్యల అనంతరం ఈ ఒప్పందం కుదరడం హాట్ టాపిక్‌గా మారింది. ఇరాన్ చర్యలపై అమెరికా ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : బోనాల వివాదం: ట్రోలర్లకు ఫరియా స్ట్రాంగ్ కౌంటర్!
Follow Us On: X(Twitter)

