కలం, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న సోమవారం రోజు ఆయన ఏపీకి రానున్నారు. ఆగస్ట్ 21 వరకు అంటే ఐదు రోజులు ఆయన ఏపీలో ఉండనున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్ట్ 17న సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న నితిన్ నబీన్‌కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలుకనున్నారు.
ఆగస్ట్ 18న తెల్లవారుజామున సింహాచలం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత విశాఖలో జరుగనున్న జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జీల సమావేశంలో పాల్గొంటారు. పార్టీ బలోపేతమే ధ్యేయంగా ముఖ్య నాయకులతో కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది.

