కలం, కరీంనగర్ : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Vamshi Krishna) జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజ్ వంటి ఘటనలతో విద్యార్థుల ಭవిష్యత్తుతో ఆడుకుంటున్నారని విమర్శించారు. అమిత్ షా ఆదేశాలతో విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడమే కాకుండా తుపాకులు ఎక్కుపెట్టారని మండిపడ్డారు. కేంద్రం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పాటిస్తూ కొత్త చట్టాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావలసిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలు, స్ఫూర్తితో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎంపీ హామీ ఇచ్చారు.

