ఇదేం చిల్లర రాజకీయం: రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : కొంతకాలంగా సొంత పార్టీ తీరుపై అంసతృప్తి వ్యక్తం చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఖైరతాబాద్ శాసన సభ్యుడు దానం నాగేందర్ పై విమర్శలు చేశారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దానం నాగేందర్ వ్యవహార శైలి బాగోలేదని మండిపడ్డారు.

దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు తాను మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటున్నాడని తెలిపారు. దానం నాగేందర్ వ్యవహార శైలి చూస్తే జనాల్లో రాజకీయ నాయకుల మీద ఉండే గౌరవం పోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదేం చిల్లర రాజకీయం అంటూ దానం నాగేందర్ (Danam Nagender) పై ఫైర్ అయ్యారు. ఇలాంటి వారి పట్ల కాంగ్రెస్ హైకమండ్ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. పక్క పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ మీద జనాల్లో గౌరవం పోతుందని.. దానం నాగేందర్ లాంటి వారిని దూరం పెట్టడమే మంచిదన్నారు. దానం నాగేందర్ లాంటి వాళ్లపై సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలని రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) సూచించారు.

Also Read : రాష్ట్రపతి నోట తెలుగు మాట.. పద్యం చెబుతూ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>