సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ జానకి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి (SP Janaki) పిలుపునిచ్చారు. శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జోన్–6 జోగులాంబ డీఐజీ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయం , ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ జానకి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రస్తుతం సమాజానికి సవాల్‌గా మారుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సైబర్ మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుర్తుతెలియని లింకులు, అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని, వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు.

సైబర్ నేరాల నివారణకు ప్రజల్లో నిరంతరం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును, కుటుంబాల భద్రతను, సమాజ ప్రగతిని తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రజలు పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రజల సహకారంతో సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం వంటి సామాజిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని, సురక్షితమైన మరియు నేర రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేశ్ కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, AO రుక్మిణీ బాయి, ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>