కలం, వెబ్ డెస్క్: కాకినాడలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యువతకు కీలక పిలుపునిచ్చారు. యువత డబ్బుకు ఓటును అమ్ముకోవద్దని సూచించారు. ద్వేషానికి తమ భవిష్యత్తును అప్పగించిదని చెప్పారు.
అలాగే ప్రశ్నించే యువత, పరిష్కారం చూపే యువత కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. అయితే ప్రశ్నించడం తప్పుకాదని, కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించవద్దని కోరారు. మన దేశానికి యువతే మూల స్థంభాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం అన్ని రకాలుగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు.

