కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జాతీయ వాలీ బాల్ క్రీడాకారుణి మక్తల్ పట్టణానికి చెందిన అనన్యను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయికి ఎదిగిన మక్తల్ బిడ్డ దేశానికి ఎంతో పేరు తీసుకురావాలంటూ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ సభ్యులు కూడా అనన్యనున పట్టు శాలువాతో సన్మానించారు. జాతీయ స్థాయిలో రాణిస్తున్న అనన్యను స్ఫూర్తిగా తీసుకుని జిల్లా క్రీడాకారులు ఆ స్థాయికి ఎదగాలని మంత్రి అన్నారు.

