శ‌ర్వాతో శ్రీనువైట్ల కొత్త‌ సినిమా షురూ!

క‌లం, వెబ్‌డెస్క్‌: టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand), ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల (Sreenu Vaitla) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు లాంఛనంగా ప్రారంభమైంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జార్జ్ క్రిష్’ (George Krish) అనే టైటిల్‌ ఖరారు చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టగా నిర్మాత సురేశ్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

శర్వానంద్ నటించిన మరో సినిమా ‘భోగి’ ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా బైక‌ర్ సినిమాతో హిట్ కొట్టిన శ‌ర్వా వ‌రుస సినిమాల‌తో త‌న ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్ ఇస్తున్నాడు. శ్రీనువైట్ల సినిమాలంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అనే న‌మ్మ‌కం ఆడియెన్స్‌కు ఉంది. ఇప్ప‌టికే శ‌ర్వాకు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ కాంబినేష‌న్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>