పూరి వద్ద ప్రమాదం: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు!

కలం, వెబ్ డెస్క్​ : ఒడిశాలోని పూరి రైల్వే స్టేషన్ సమీపంలో పెద్ద ప్రమాదం తప్పింది. తాల్చేర్ నుండి పూరి వస్తున్న ఎంఈఎమ్‌యు (MEMU) ప్యాసింజర్ రైలు పూరి స్టేషన్‌కు కేవలం 500 మీటర్ల దూరంలో పట్టాలు తప్పింది (Puri Derailment). ఈ ఘటన ప్లాట్‌ఫాం నంబర్ 3 వద్ద చోటుచేసుకుంది. రైలు తక్కువ వేగంతో వెళ్తుండటం వల్ల పెద్ద నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది, ఆర్‌పీఎఫ్ బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చాయి. బోగీలను తొలగించే పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. రైళ్ల రాకపోకలకు స్వల్ప ఆటంకం ఏర్పడినప్పటికీ మిగతా రైలు సేవలపై ప్రభావం పడలేదు.

Also Read : రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఇటలీ ఆగ్రహం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>