బాలల భద్రతే లక్ష్యంగా.. విద్యార్థులకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ పై అవగాహన

కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండలం గోకారం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ (Gokaram ZPHS) పాఠశాల విద్యార్థులకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ ‘పై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మత్స్యగిరి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల పైన లైంగిక వేధింపులు జరిగినట్లు తెలిస్తే ఫోక్సో చట్టం క్రింద కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు. నేటి సమాజంలో పిల్లలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు చట్ట ప్రకారం అత్యంత కఠినమైన శిక్షలు విధిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, స్కోప్ సంస్థ ప్రతినిధి బి. నరసింహ రాజు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>