రేవంత్‌ను డాక్టర్‌కు చూపించాలి: ఎమ్మెల్యే సంజయ్!

కలం, వెబ్ డెస్క్​ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన క్షుద్ర పూజలు, చేతబడుల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ (MLA Sanjay) తీవ్ర స్థాయిలో స్పందించారు. నవీన యుగంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి హోదాకు తగదని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు చూస్తే ఆయన ఎంత అసమర్థుడో అర్థమవుతోందని సంజయ్ విమర్శించారు. మూడేళ్ల పాలన పూర్తవుతున్నా ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై మాట్లాడకుండా క్షుద్ర పూజలు, చేతబడులు అంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇంతకంటే దిగజారుడు చర్య ఉండదని సంజయ్ అన్నారు. చిల్లర మాటలు, చిల్లర వేషాలు, చిల్లర డ్రామాలు ఎంతకాలం కొనసాగిస్తారని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి కూడా చేతబడులు, క్షుద్ర పూజల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి అయ్యాడా అని సంజయ్ ప్రశ్నించారు. వెంటనే రేవంత్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు మంచి వైద్యుడికి చూపించాలని ఎద్దేవా చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>