విషాదం.. చెరువులో పడి తల్లి, కుమారుడి అనుమానస్పద మృతి!

కలం, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కురవి (Kuravi ) మండలం పిల్లిగుండ్ల తండాలో భూక్యా నవ్య (30), ఆమె కుమారుడు అన్వేష్ (9) ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని మొగిలిచర్ల రెడ్డి కుంట లో పడి మరణించారు. పశువులను మేపడానికి వెళ్లిన తల్లి కొడుకులు గురువారం సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆమె ఫోన్ కు ఫోన్ చేస్తే సమాధానం రాకపోవడంతో గాలింపు చేపట్టారు. సాయంత్రం చెరువు వద్ద అన్వేష్ కు చెందిన చెప్పులు, దుస్తులు కనిపించడంతో చెరువులో గాలించగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై గ్రామస్తులు కొందరు ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందని భావిస్తుండగా.. మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>