మైదానంలో ఫంగస్ కలకలం.. లా లిగా మ్యాచ్ వాయిదా!

కలం, స్పోర్ట్స్ : సెల్టా విగో-ఒసాసునా మ్యాచ్‌కు ఫంగస్ అడ్డంకిగా మారింది. బలైదోస్ స్టేడియం మైదానంలో నెలకొన్న అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆదివారం జరగాల్సిన మ్యాచ్ (La Liga Match) వాయిదా పడింది. ఈ నిర్ణయాన్ని రెండు క్లబ్‌లతో పాటు స్పానిష్ ఫుట్‌బాల్ సమాఖ్య కలిసి తీసుకున్నాయి. మైదానాన్ని అధికారులు బుధవారం పరిశీలించారు. పిచ్‌ను ప్రభావితం చేస్తున్న వ్యాధి కారణంగానే మ్యాచ్‌ను వాయిదా వేసినట్లు లా లిగా వెల్లడించింది. తాజా నిర్ణయం ప్రకారం ఈ మ్యాచ్‌ను ఆగస్టు 27న నిర్వహించనున్నారు.

మైదానంలో వ్యాపించిన ఫంగస్‌ను తొలగించేందుకు చేపట్టిన చర్యలను లా లిగా గత వారం పరిశీలించి ఆమోదించినట్లు సెల్టా విగో తెలిపింది. అయితే ఇటీవల చోటుచేసుకున్న వాతావరణ పరిస్థితులు మైదానం పరిస్థితిని మరింత దిగజార్చాయని క్లబ్ పేర్కొంది. పిచ్ ఆటకు అనుకూలంగా లేకపోవడంతో ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని సెల్టా విగో స్పష్టం చేసింది. ఆగస్టు 27న మైదానం పరిస్థితులు మెరుగుపడితే మ్యాచ్ నిర్వహించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>