విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వినతి

కలం, సంస్థాన్ నారాయణపూర్ : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సభ్యులు బోయ రాములు ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపూర్ (Samsthan Narayanpur) తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. బోయ రాములు మాట్లాడుతూ.. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగులో ఉన్న ఆరు డిఏ లను ప్రకటించాలని, సిసిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొమ్మగాని ముత్యాలు, ప్రభాకర్, వంశీకృష్ణ, అమృతాచారి, భిక్షంరెడ్డి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>