నర్సాపూర్‌లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur) పట్టణంలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని గోండియా ప్రాంతానికి లారీల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా, నర్సాపూర్ బస్ డిపో సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 7న విజిలెన్స్ అధికారులు అందించిన పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు.

బియ్యంతో ఉన్న లారీని పట్టుకొని, సీజ్ చేశారు. మొత్తం 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారికంగా సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని భద్రత నిమిత్తం లింగాపూర్‌లోని ఓ రైస్ మిల్లుకు తరలించారు. ఈ అక్రమ రవాణాపై అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read : తెలంగాణ స్మార్ట్ రేష‌న్ కార్డ్‌.. సెక్యురిటీ ఫీచ‌ర్స్ ఇవే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>