కలం, వెబ్ డెస్క్: కళ్యాణలక్ష్మి , షాదిముబారక్ పథకాలపై స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు (TG High Court ) సంచలన తీర్పు వెలువరించింది. చట్టసభల్లో తీర్మానం చేయకుండా అందుబాటులోకి తీసుకొచ్చిన ఉచిత పథకాలు చెల్లవని విజయ్ గోపాల్ అనే న్యాయవాది వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ పిటిషన్ గత విచారణలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినా, నాలుగు వారాలైన కౌంటర్ దాఖలు చేయలేదని ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. దీంతో తాజా విచారణలో కళ్యాణలక్ష్మి , షాదిముబారక్ పథకాలపై స్టే విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. విచారణను సెప్టెంబర్ 9 కి వాయిదా వేసింది. దీంతో తదుపరి విచారణలోగా కళ్యాణలక్ష్మి , షాదిముబారక్ పథకాల చెల్లింపులు చేయవద్దంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

