ఎంత కష్టమొచ్చే.. యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కిన రైతు!

కలం, మెదక్ బ్యూరో: యూరియా బుకింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రైతులకు యూరియాను ఎలా బుక్ చేసుకోవాలో తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల బుకింగ్ చేసినా యూరియా అందక (Urea Crisis) వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పరిస్థితులు నేటికీ నెలకొన్నాయి. ఒకవైపు ఎల్‌నినో, మరోవైపు యూరియా కష్టాలు రైతులను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఈ క్రమంలో మెదక్ జిల్లాలో ఓ రైతు అధికారుల కాళ్లు మొక్కడం చర్చనీయాంశమవుతోంది.

మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన బోయిని రాములుకు గత కొద్ది రోజులుగా యూరియా దొరక్క అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయాడు. బుధవారం కొల్చారం మండలం రంగంపేట సొసైటీ కార్యాలయానికి వెళ్లాడు. ‘900 రూపాయలైనా ఇస్తా.. సార్ మీరు ఆదుకోవాలి’ అంటూ సొసైటీ అధికారుల కాళ్లు మొక్కాడు. తనకు ఆన్‌లైన్‌లో యూరియా ఎలా బుక్ చేసుకోవాలో తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో యూరియా రైతుల కష్టాలను అద్దం పడుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>