కలం, యాదాద్రి భువనగిరి : హైదరాబాద్, వరంగల్ మధ్య ఉన్న ఎన్ హెచ్-163 ను ఆరు లైన్ల జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయడం తో పాటు భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో అనేక ముఖ్యమైన రోడ్డు మౌలిక వసతులు, భద్రతా పనులను వేగవంతం చేయాల్సిందిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని కోరారు.
అలాగే హైదరాబాద్ – విజయవాడ ఎన్ హెచ్ 365, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ హెచ్-565 లో పలు గ్రామాల వద్ద అవసరమైన రోడ్డు విస్తరణ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో పాటు డ్రైనేజీ, సర్వీసు రోడ్డు పనులతో సహా అనేక రోడ్డు భద్రత, కనెక్టివిటీ అవసరాలను కూడా ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భువనగిరి ప్రజలకు, పరిసర ప్రాంతాల వారికి మెరుగైన కనెక్టివిటీ కల్పించడంతో పాటు రోడ్డు భద్రతను పెంపొందించడం, ప్రమాదాలను నివారించడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించి రాకపోకలు సజావుగా సాగేందుకు రోడ్డు అభివృద్ధి పనులు ఎంతో కీలకమని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు కారిడార్‌లో నకిరేకల్‌ను చేర్చాలి
ప్రతిపాదిత హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ రైలు (బుల్లెట్ రైలు) కారిడార్‌లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చేర్చాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ (MP Chamala) రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. గ్రీన్ ఫీల్డ్ అలైన్‌మెంట్‌కు బదులుగా ఇప్పటికే ఉన్న ఎన్ హెచ్-65 కారిడార్ గుండా ప్రతిపాదిత అలైన్‌మెంట్‌ను పరిశీలిస్తే, ఆ ప్రాంతంలోని ఇప్పటికే ఉన్న పట్టణాలు, వాణిజ్య కేంద్రాలు, పెద్ద సంఖ్యలో జనాభాకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందని ఎంపీ అభ్యర్థించారు.
ఈ నేపథ్యంలో, కారిడార్‌ను కొత్త మార్గంలో కాకుండా ఇప్పటికే ఉన్న ఎన్ హెచ్-65 మీదుగా మళ్లించడం వల్ల నకిరేకల్ ప్రజలకు, అలాగే విస్తృత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రతిష్టాత్మక హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ ద్వారా అధిక ప్రయోజనాలు చేకూరుతాయని చామల స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనను అనుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన రైల్వే శాఖను కోరారు. ఈ సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.
Also Read : కాకతీయ వర్సిటీపై రాష్ట్ర సర్కార్ సవతి తల్లి ప్రేమ!
Follow Us On: X(Twitter)

