కలం, వెబ్ డెస్క్ : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఏం చేశారో సమీక్షించుకోవాలి కూనంనేని సూచించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తే ప్రశంసిస్తాం.. చెడు చేస్తే ప్రశ్నిస్తాం’ అని కూనంనేని స్పష్టం చేశారు.
కాగా, గత కొన్ని రోజులుగా కూనంనేని సాంబశివరావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూనే ఉన్నారు. పొత్తు ధర్మం పాటించాలని కాంగ్రెస్ ను కొరుతున్నారు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టులను తేలిక తీసుకుని.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తామని కూనంనేని తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడడం సంచలనంగా మారింది.

