వలిగొండలో బిజెపి తిరంగా ర్యాలీ

కలం, వలిగొండ : వలిగొండ (Valigonda) మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు విద్యార్థులతో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించారు. తిరంగా ర్యాలీలో పాల్గొన్నవారు మాట్లాడుతూ తిరంగా ర్యాలీ దేశ ప్రజల యొక్క ఐక్యతను తెలియజేస్తుందని, ర్యాలీలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులని వారందరూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని, దేశ ఔన్నత్యం కోసం ప్రతి ఒక్క భారతజాతి బిడ్డ పనిచేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలే చంద్రశేఖర్, వలిగొండ సర్పంచ్ (Valigonda Sarpanch) వెంకట పాపిరెడ్డి, నాయకులు సాయిని యాదగిరి, యాదగిరి, రాచకొండ కిష్టయ్య, కనతాల అశోక్ రెడ్డి, బందారపు రాములు, రాస వెంకట్, మైసొల్ల రామనర్స్, బచ్చు శ్రీనివాస్, మైసొల్లా మచ్చగిరి , నాగరాజు, రంజిత్ రెడ్డి, లోడే లింగస్వామి గౌడ్, వెంకటేశం, మహేష్, శ్రీనివాస్, మండల నరసింహ, రామచంద్రం, చిన్న మచ్చ గిరి, పెద్ద కిట్టు, వెంకటేశం, జంగయ్య పాల్గొన్నారు.

Also Read : పోచారం బీఆర్ఎస్ ఎంట్రీపై మాజీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>