FCRA బిల్లును జేపీసీకి పంపాలని లోక్ సభ తీర్మానం

కలం, వెబ్ డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్ సభలో విదేశీ నిధుల నియంత్రణ చట్టం సవరణ బిల్లు (FCRA Bill)పై లోక్ సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎఫ్సీఆర్ఏ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపాలని లోక్ సభ తీర్మానం చేసింది. ఈ మేరకు బిల్లుపై 31 మంది సభ్యులతో జేపీసీని కేంద్రం ఏర్పాటు చేసింది. జేపీసీలో 21 మంది లోక్ సభ, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలోపు నివేదిక ఇవ్వాలని కేంద్రం గడువు విధించింది. ప్రతిపక్షాలు ఆందోళనల నడుమ బిల్లుపై తీర్మానం చేసింది.

అక్రమ మత మార్పిడుల కట్టడే లక్ష్యం..

విదేశీ నిధుల దుర్వినియోగాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది. విదేశాల నుంచి వచ్చే నిధులు, అక్రమ మత మార్పిడులు, గ్రాంట్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, దేశ భద్రత, పారదర్శకతలను కాపాడటానికే 2010 నాటి చట్టానికి సవరణలుచేస్తూ ఈ బిల్లు (FCRA Bill) ప్రవేశపెట్టింది. విదేశీ నిధులు జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా, రాజకీయ కార్యకలాపాలకు వినియోగించకుండా నిరోధించేందుకు బిల్లులో కీలక సవరణలు చేసింది.

కాంగ్రెస్ ఫైర్..

అయితే ఈ బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎన్డీయే సర్కార్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు వెంటనే ఉపసంహరించుకోవాలని.. దీనిని వ్యతిరేకిస్తున్నామని కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. మైనారిటీలను టార్గెట్ చేస్తూ ఈ బిల్లు రూపొందించారని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. దీంతో లోక్ సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు.

Also Read : 51 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా? హకీ ప్రపంచకప్‌పై భారత్ గురి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>