ప్రేమ పెళ్లి.. భర్తను వదిలేసి కండక్టర్‌తో భార్య జంప్!

కలం, వెబ్ డెస్క్: నేటి కాలంలో రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. దాంపత్య జీవితంలో ఉంటూనే.. విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ జీవిత భాగస్వామిని మోసం చేస్తూ తమ దారి తాము చూసుకుంటున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పెళ్లి అయ్యాక కూడా తమ ప్రియుడు/ ప్రేయసి కోసం అడ్డొచ్చిన వారిని చంపటానికి సైతం వెనుకాడటం లేదు. ఏదోరకంగా స్కెచ్ వేసి అడ్డుతొలగించుకోవాలని చూస్తున్నారు. మరికొందరైతే.. తన భాగస్వామిని వదిలేసి ఇష్టపడ్డ వారితో రాత్రికి రాత్రే పారిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలో కేరళ రాష్ట్రంలో జరిగింది. ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ జీవితంలో అనూహ్య ఘటనను సోషల్ మీడియా వేదికగా పంచుకొని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలేమైందంటే..

రెండేళ్ల క్రితం మేఘా అనే యువతిని మలయాళ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ ఎన్ ఆర్డీ (Influencer Akhil NRD) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే భర్తతో ఉంటూనే అతనికి తెలియకుండా మరో వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. భర్తకు తెలియకుండా స్థానిక బస్సు కండక్టర్‌తో మేఘా ప్రేమలో పడింది. ఇకవారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని గ్రహించి.. భర్తతో తెగదెంపులు చేసుకోవాలని అనుకుంది. ఈ క్రమంలోనే భర్తను వదిలేసి కండక్టర్‌తో కలిసి రాత్రికి రాత్రే వెళ్లిపోయింది. జీవితాంతం తోడుగా ఉంటుందని భావించిన అఖిల్ ఎన్ ఆర్డీకి ఊహించని షాక్ తగలడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

తొలుత మిస్సింగ్ అని భావించిన అఖిల్.. భార్య లేకపోవడంతో సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.కెమెరాలో తన ఇంటిముందు నుంచి లగేజీ బ్యాగులతో తన భార్య, కండక్టర్‌తో వెళ్లడాన్ని చూశాడు. పట్టలేనంత గుండెభారంతో కుంగిపోయిన అఖిల్.. తనకు జరిగిన అవమానాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కండక్టర్ తో తన భార్య వెళ్లిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను అఖిల్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>