కలం, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు చిలికిచిలికి గాలివాననా మారి చివరికి ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం (UP Murder) ముజఫర్‌నగర్‌లోని బుధానా ప్రాంతంలో మరో ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అర్జెంట్‌గా రమ్మని పిలిచి.. ఏకంగా తన భర్తను ప్రియుడి చేతే చంపించింది ఓ దుర్మార్గపు భార్య.
పెళ్ళికి ముందే..
మీరట్‌కు చెందిన తాలిబ్ అనే వ్యక్తికి మీనా అనే యువతితో వివాహం జరిగింది. అయితే వివాహపు పూర్వమే ఆమె మరో అబ్బాయి ఆసిమ్ తో సన్నిహితంగా ఉండేది. ఇరువురి మధ్య ఏర్పడిన బంధం.. పెళ్లి అయ్యాక కూడా కొనసాగించింది. ఈ క్రమంలోనే భర్తతో కాకుండా ప్రియుడితోనే ఉండాలని నిశ్చయించుకుంది. దాంపత్య బంధం కంటే.. వివాహేతర సంబంధమే తనకు ముఖ్యమని భావించిన సదరు మహిళ భర్తను చంపేయాలని మాస్టర్ ప్లాన్ వేసింది.
17 సార్లు గొడ్డలతో దాడి..
తన ప్రియుడు, సదరు మహిళ పథకం ప్రకారమే స్కెచ్ వేసి ప్రీ ప్లాన్ చేసుకున్నారు. వెల్డింగ్ పని కోసం గుజరాత్‌కు వెళ్లిన తాలిబ్‌ను అర్జెంట్‌గా బుధానాకు రమ్మని భార్య మీనా పిలిచింది. భార్య పిలుపుతో తాలిబ్ ఊరికి తిరిగివచ్చాడు. ఈ క్రమంలోనే ఎవరు లేని ప్రాంతంలో మీనా ప్రియుడు ఆసిమ్.. తాలిబ్ పై గొడ్డలితో విరుచుకుపడ్డాడు. 17 సార్లు గొడ్డలితో భీకర దాడి చేశాడు.
నిందితుడి కాల్పులు..
ఈ దుర్మార్గపు ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడికి పట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీసులను గమనించిన ఆసిమ్.. వెంటనే అక్కడినుంచి పరారయ్యాడు. వెంటనే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురుకాల్పులు జరపగా.. ఆసిమ్ కాలికి బుల్లెట్ తగిలింది.
భార్య మీనాపై కేసులు..
ఈ దాడిలో తాలిబ్ కు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు, పోలీసులు వెంటనే అతనిని స్థానిక ఆసుపత్రిలో చేర్చించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ భర్త తాలిబ్ మృతి చెందాడు. ఈ హత్యా ఘటనపై బీఎంఎస్ సెక్షన్లు 103 (హత్య), 61-2 (నేరపూరిత కుట్ర) కింద మీనాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రియుడి కోసమే భార్య హత్య చేయించిందా? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

