అశ్వారావుపేట ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. రోగులు నరకయాతన

​కలం, ఖమ్మం బ్యూరో: డాక్టర్ల నిర్లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట ప్రభుత్వ దవాఖానాలో (Aswaraopeta Govt Hospital) రోగులకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. చేతికి తొడిగే గ్లౌజ్‌నే పేషెంట్ చేతికి టోర్నికేట్‌లా కట్టి ఇంజక్షన్ ఇస్తున్నారంటే వైద్య ప్రమాణాలు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రులు రోగాలను నయం చేయాలి కానీ, ఇలాంటి నిర్లక్ష్యపు పద్ధతులతో మరిన్ని ఇబ్బందులకు గురిచేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ఆసుపత్రిలో సిబ్బంది అలసత్వం పరాకాష్టకు చేరింది. స్థానికంగా నివాసం ఉండే బుచ్చిబాబు అనే ట్రాక్టర్ డ్రైవర్ తీవ్రమైన కడుపు నొప్పితో ఉదయం 6 గంటలకే ఆసుపత్రికి చేరుకున్నాడు. గంటపాటు నొప్పితో బాధ పడుతున్నా నైట్ డ్యూటీ డాక్టర్, నర్సులు అందుబాటులోకి రాలేదని వాపోయాడు. డ్యూటీ వేళల్లో సిబ్బంది లేకపోవడంతో రోగులు గంటల తరబడి ఆసుపత్రి ఆవరణలోనే నరకయాతన అనుభవిస్తున్నారు. సిబ్బంది కేవలం హాజరు పట్టికలకే పరిమితమవుతున్నారని, పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని స్థానికులు మండిపడుతున్నారు.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>