కలం, భద్రాచలం: విధి నిర్వహణలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కార్మికులకు సంబంధించిన యూనిఫాం ధరించాలని భద్రాచలం (Bhadrachalam) ట్రాఫిక్ ఎస్ఐ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక ఆటో డ్రైవర్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని, ప్రయాణికులు, వాహనదారుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
పోలీస్ అధికారుల సూచనల మేరకు అడ్డాలోని సభ్యులందరూ ఆలస్యం చేయకుండా తమ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని, పాస్పోర్ట్ సైజ్ ఫోటోను వెంటనే అందజేయాలని అడ్డా ప్రెసిడెంట్ తీగల ముత్యాల రావు విజ్ఞప్తి చేశారు. అందరూ సమన్వయంతో వ్యవహరించి నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.

