కలం, వెబ్ డెస్క్: కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందేమాతరం బిల్లుకు (Vande Mataram Bill) భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారికంగా ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు నేటి నుంచి చట్టంగా మారింది. ఈ కొత్త చట్టం అమల్లోకి రావడంతో జాతీయ చిహ్నాలను అవమానించడం, వందేమాతరం గేయాన్ని అవమానించడం చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. వందేమాతర గీతాన్ని అడ్డుకోవడం లేదా అవమానించేలా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటారు. దేశభక్తిని, జాతీయ భావాలను మరింత పెంపొందించే దిశగా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకుంది.
ఈ బిల్లును రాజ్యసభ ఈ బిల్లును జూలై 29న ఆమోదించగా, లోక్‌సభ జూలై 30న దీనికి ఆమోదం తెలిపింది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో ఇది చట్టంగా మారింది. దీంతో ఆగస్టు 15న జరుగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట పై తొలిసారిగా ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

