చేయూత భృతిపై బీడీ కార్మికుల పోరుబాట

కలం, నిర్మల్: అర్హులైన బీడీ కార్మికులందరికీ (BD Workers) ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయూత పథకం ద్వారా జీవన భృతి అందించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కట్ల రాజన్న డిమాండ్ చేశారు. మంగళవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని దేశాయి బీడీ కంపెనీలో బీడీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కట్ల రాజన్న మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులందరికీ చేయూత పథకం కింద నెలకు రూ.4,016 జీవన భృతి అందిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. అర్హులైన ప్రతి బీడీ కార్మికుడికి ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవన భృతి అందించాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న జిల్లా కలెక్టరేట్ (Nirmal Collectorate) ఎదుట నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి కార్మికులు (BD Workers) పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కట్ల రాజన్న పిలుపునిచ్చారు.

Also Read : రాహుల్ గాంధీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. డైట్‌పై యూత్‌కి సూచనలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>