కలం, వెబ్ డెస్క్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్నస్వామి ఆలయంలో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు అఖిల్ రాజ్ (Akhil Raj), యూట్యూబ్ ఫోక్ డ్యాన్స్ సెన్సేషన్ నాగదుర్గ (Naga Durga) కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో వీరిద్దరూ (Akhil Raj – Naga Durga) కలిసి కనిపించడంతో భక్తులు, అభిమానులు ఆశ్చర్యపోయారు. దర్శనం అనంతరం ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
కొత్త ప్రాజెక్ట్ సంకేతమా?
వీరిద్దరూ ఒకేసారి మల్లన్న స్వామిని దర్శించుకోవడం వెనుక ఏమైనా ప్రత్యేక కారణం ఉందా అనే చర్చ మొదలైంది. త్వరలోనే వీరి కాంబినేషన్లో ఒక జానపద గీతం లేదా కొత్త ప్రాజెక్ట్ రాబోతోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read : వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
Follow Us On: Instagram

