కలం, మెదక్ బ్యూరో: అబద్ధాలు ఆడడంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి (Jagga Reddy) ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువేనని, ఫ్రస్ట్రేషన్‌లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (Chinta Prabhakar) ఎద్దేవా చేశారు. మంగళవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ సంగారెడ్డికి వస్తున్న సందర్భంగా జగ్గారెడ్డి, ఆయన భార్య నిర్మల ఏ హోదాలో ముఖ్యమంత్రితో వేదిక పంచుకోవాలో అర్థం కావడం లేదన్నారు. రాజకీయ అభద్రతా భావంతో ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని విమర్శించారు.
మాజీ మంత్రి హరీశ్ రావు జగ్గారెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం చేశారనే వ్యాఖ్యలు సరికాదన్నారు. హరీశ్ రావు గురించి మాట్లాడే నైతిక హక్కు జగ్గారెడ్డికి లేదన్నారు. హరీశ్ రావు కాలిగోటికి కూడా జగ్గారెడ్డి సరిపోరని చింతా ప్రభాకర్ (Chinta Prabhakar) ఘాటుగా విమర్శించారు. గెలిచిన ప్రతిసారీ తన కోసం, తన కుటుంబం కోసం ప్రజలను మోసం చేయడమే జగ్గారెడ్డి చరిత్ర అని అన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ పేదల అసైన్డ్ భూములు దోచుకోవడం తప్ప , జగ్గారెడ్డికి ప్రజల సమస్యలు పట్టవని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విమర్శించారు.
Also Read : పార్టీ మార్పుపై ఎమ్మెల్యే పోచారం సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Instagram

