కలం, నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ (Chityal) గ్రామంలోని ఈషా పెరాలసిస్ సెంటర్‌లో పుష్య నక్షత్రం సందర్భంగా 0 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ఉచితంగా స్వర్ణ బిందు ప్రాశన (Swarna Bindu Prashana) పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశ్వేశ్వర్ మాట్లాడుతూ ఆయుర్వేదంలో స్వర్ణ బిందు ప్రాశనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణపై తల్లిదండ్రులలో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ విశ్వేశ్వర్, డాక్టర్ వాసవి, అడ్మినిస్ట్రేషన్ స్వాతి, రాఘవేంద్ర, హనుమంత్ రెడ్డి, అన్విత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : రాహుల్ గాంధీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. డైట్‌పై యూత్‌కి సూచనలు
Follow Us On: Instagram

