బాసర అమ్మవారి సన్నిధిలో హరీశ్ శంకర్‌

కలం, నిర్మల్: బాసర (Basara)  శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో(Gnana Saraswati Temple) ప్రముఖ సినీ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar)  మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలో ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ఆధ్వర్యంలో హరీశ్ శంకర్ ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులు ఆయనకు హారతి అందించారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆలయ సిబ్బంది హరీశ్ శంకర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అచ్యుత్ కుమార్, హరీష్, కళాదర్ శర్మ, వేద పండితులు నవీన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Also Read : అంజనగిరి పాఠశాలలో విద్యార్థులతో మమేకమైన నిరంజన్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>