కలం, వెబ్ డెస్క్: సిరియా దేశ మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అస్సద్ (Bashar Al Assad)కు ఉరి శిక్ష విధిస్తూ కోర్ట్ తుది తీర్పు వెలువరించింది. ఆయనతో పాటు సోదరుడు మహెర్ అల్ అసద్, సమీప బంధువు అతీఫ్ నజీబ్‌కు కూడా ఇదే శిక్షలు విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. గత 14 ఏళ్లుగా సిరియాలో బషర్ సాగించిన నేరాలు, చేసిన యుద్ధాల కారణంగా 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. అతడికి మహెర్, నజీబ్ తోడ్పాటు అందించి.. మారణహోమం సృష్టించారని వ్యాఖ్యానించింది.
నజీబ్‌కు శిక్ష వినిపించిన జడ్జి..
ఖైదీ దుస్తుల్లో నజీబ్‌ను జైలు నుంచి కోర్ట్ హాల్లోకి పోలీసులు తీసుకురాగా, అతడికి మరణ శిక్ష విధిస్తున్నట్లు జడ్జి చదివి వినిపించారు. ఆర్మీ బ్రిగేడియర్ జనరల్‌గా పనిచేసిన ఈయన.. 2011లో దరా ప్రావిన్సుకి సెక్యూరిటీ అధిపతిగా పనిచేశారు. ఆ సమయంలోనే నిరసనకారులను చంపేయడంతో పాటు సైన్యంతో కలిసి ప్రజలపై అరాచకాలు చేసినట్లు మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. తాజాగా, ఆయనకు కోర్ట్ మరణ శిక్ష విధించింది.
బషర్ ఇక రానట్లేనా..?
బషర్ అల్ అస్సద్ (Bashar Al Assad) ప్రభుత్వానికి నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. 2024 డిసెంబర్ 8న రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో ప్రాణ భయంతో బషర్, అతడి తమ్ముడు మహెర్ విమానం ఎక్కి మాస్కోకు పారిపోయారు. ఆ రోజు నుంచే సిరియాలో బషర్ పాలన ముగిసిపోయింది. ప్రస్తుతం అన్నదమ్ములు రష్యాలోనే ఆశ్రయం పొందుతున్నారు. ఇద్దరికి మరణ శిక్ష విధించిన నేపథ్యంలో ఇక వారు తిరిగి సిరియాకు వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లేనని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం సిరియాను ఆందోళనకారుల కూటమే పాలిస్తుండగా.. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు.
Also Read : ప్లాస్టిక్ నోట్లపై కేంద్రం సంచలన ప్రకటన
Follow Us On: Sharechat

