సహల్ హ్యాట్రిక్ వేట.. మోహన్ బగాన్ 6-0 ధమాకా!

కలం, స్పోర్ట్స్: 135వ డ్యూరాండ్ కప్‌లో మోహన్ బగాన్ (Mohun Bagan) సూపర్ జెయింట్ అదరగొట్టింది. కోల్‌కతాలోని కిషోర్ భారతి క్రీడాంగణంలో జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో సీఐఎస్‌ఎఫ్ ప్రొటెక్టర్స్‌పై 6-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో వరుసగా మూడో గెలుపును నమోదు చేసిన మోహన్ బగాన్ గ్రూప్ టాపర్‌గా నిలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మ్యాచ్ ప్రారంభం నుంచే మోహన్ బగాన్ ఆటగాళ్లు ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించారు. సహల్ అబ్దుల్ సమద్ 17వ, 19వ నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. అనంతరం 24వ నిమిషంలో మన్వీర్ సింగ్ మరో గోల్ సాధించాడు. 37వ నిమిషంలో సహల్ అద్భుతంగా మైదానం మధ్య నుంచి బంతిని ఒంటరిగా తీసుకెళ్లి మరో గోల్ కొట్టాడు. దీంతో తొలి అర్ధభాగంలోనే సహల్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి మోహన్ బగాన్ 4-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

రెండో అర్ధభాగంలోనూ అదే జోరు

సెకండ్ హాఫ్‌లోనూ మోహన్ బగాన్ ఆటగాళ్లు అదే దూకుడును కొనసాగించారు. 68వ నిమిషంలో సహల్ అందించిన అద్భుతమైన పాస్‌ను జేమీ మెక్‌లారెన్ గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత 73వ నిమిషంలో టెక్చమ్ అభిషేక్ సింగ్ ఆరో గోల్ సాధించడంతో మోహన్ బగాన్ 6-0 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నిమిషాలలో సీఐఎస్‌ఎఫ్ ప్రొటెక్టర్స్ గోల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఓటమితో సీఐఎస్‌ఎఫ్ ప్రొటెక్టర్స్ ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు లీగ్ దశను విజయవంతంగా ముగించిన మోహన్ బగాన్ సూపర్ జెయింట్.. క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>