కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం.. నేతల పిలుపు

కలం, నిర్మల్: కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత లభిస్తుందని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel), రాష్ట్ర ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampally Satyanarayana) అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ (Congress SC Department) ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ అధిష్ఠానం తగిన గుర్తింపు ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం దళిత నాయకులకు ఉన్నత పదవులు దక్కాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ కల సాకారమైందని అన్నారు.

పార్టీ గుర్తించి పదవులు కల్పించిన దళిత నాయకులు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని నేతలు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించి పార్టీకి మరింత ప్రజాదరణ తీసుకురావాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>