కలం, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli).. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ వరల్డ్ మూవీ వారణాసి (Varanasi). ఈ భారీ చిత్రం అనుకున్న టైమ్ కంటే ముందుగానే కంప్లీట్ చేసేలా జక్కన్న వర్క్ చేస్తున్నారు. జూన్ కి మహేష్ బాబు వర్క్ కంప్లీట్ అవుతుందట. మరి.. మహేష్ బాబు నెక్ట్స్ ఏంటి అంటే.. ప్లానింగ్ జరుగుతుందని.. నెక్ట్స్ మూవీ ఫిక్స్ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మహేష్ బాబు ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ కోసం.. మూడు సంవత్సరాలు కేటాయించాడు. అందుచేత నెక్ట్స్ మూవీని సాధ్యమైనంత ఫాస్ట్ గా స్టార్ట్ చేయాలి.. అంతే ఫాస్ట్ గా రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడట. వారణాసి మూవీ రిలీజ్ తర్వాత మహేష్ రేంజ్ మారుతుంది. అందుచేత తదుపరి సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడట. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. నెక్ట్స్ మూవీని తన సొంత బ్యానర్ లోనే చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఆ బ్యానర్ తో పాటు వేరే బ్యానర్ యాడ్ అయితే అవ్వచ్చు కానీ.. మెయిన్ గా తనే సొంతంగా సినిమా నిర్మించాలని డిసైడ్ అయ్యాడు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.
అయితే.. దర్శకుడు ఎవరు అనేది ఇంకా బయటకు రాలేదు కానీ.. సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) పేరు గట్టిగా వినిపిస్తుంది. సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాని చాలా తక్కువ టైమ్ లో కంప్లీట్ చేసేలా పక్కా ప్లాన్ తో షూటింగ్ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగ యానిమల్ 2 చేయాలి. ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) డేట్స్ ఇస్తానంటే.. సందీప్ ప్లాన్ మార్చి ముందుగా మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ కూడా ఉంది. మహేష్.. సొంత బ్యానర్ లో సినిమా చేయడం కన్ ఫర్మ్.. డైరెక్టర్ ఎవరు అనేదే తెలియాల్సివుంది.
Read Also: ఆ హీరోయిన్ ను వదిన అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
Follow Us On: Instagram


