కలం, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Malla Reddy) దర్శించుకున్నారు. ఆయనకి అర్చకులు ప్రధాన ఆలయంలో ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామివారి విశిష్టతను వివరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రఘు, ప్రధాన అర్చకులు కాండూరి వెంకట చార్యులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : పార్లమెంట్‌కు రావాలంటేనే వారికి భయం: రాహుల్ గాంధీ
Follow Us On: Sharechat

