కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరులో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy )కి ఇటీవలే అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) కమ్యూనిటీ సర్వీస్ అవార్డు ప్రదానం చేసింది. అవార్డు అందుకున్న తరువాత తొలిసారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రాగా.. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు. సమాజ సేవలో ఎమ్మెల్యే చూపుతున్న నిబద్ధత, ప్రజల పట్ల అంకితభావం, ముఖ్యంగా విద్యాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు.
ఎమ్మెల్యేను సత్కరించినవారిలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ కుమార్, ఎన్.పి.వెంకటేష్, కార్పొరేటర్లు తాహెర్, ప్రశాంత్, ఫకృ, షబ్బీర్ అహ్మద్, ఎంపీ ప్రవీణ్ కుమార్, రమేష్ రెడ్డి, యాదగిరి గౌడ్, మజ్జీద్, పాతూరి రమేష్, రాధ గోవర్ధన్, భాను చందర్, మోసిన్, హన్వాడ మండల పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాములు యాదవ్ తదితరులు ఉన్నారు.

