మసీదులో కొండచిలువ కలకలం.. చివరకు ఏమైందంటే!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం కోయగూడెం మసీదు గ్రౌండ్‌లో సోమవారం భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. మైదానంలో కొండచిలువను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ​రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ సమయస్ఫూర్తితో కొండచిలువను సురక్షితంగా పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

​కోయగూడెం, తాళ్లగొమ్మూరు ప్రాంతాలు అటవీ సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల ఇక్కడ తరచూ పాములు, ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఆటలాడేందుకు మైదానాలకు లేదా బయటకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read : తెలంగాణలో జనసేన ఎంట్రీకి రాజాసింగ్ పిలుపు.. పవన్ కల్యాణ్‌కు కీలక విజ్ఞప్తి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>