కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగా ప్రాంతంలో 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ (Iqbal Sheikh) అనే టీనేజర్ జీవన విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కనిపించని శక్తులు, తనను తరుముతున్నాయని నమ్మి అతను వారాల తరబడి కుంటలు, చెరువుల్లోనే గడుపుతున్నాడు. పగలు, రాత్రి తేడా లేకుండా నీటిలోనే ఉంటున్నాడు. నీటి బయటకు రాగానే తన శరీరంపై తీవ్రమైన మంట పుడుతుందని, మళ్లీ నీటిలోకి వెళ్లగానే హాయిగా అనిపిస్తుందంటున్నాడు.
పాలిపోయిన చర్మం.. దీనస్థితిలో నిరుపేద కుటుంబం
ఎక్కువ సమయం నీటిలో నానుతూ ఉండటంతో ఇక్బాల్ (Iqbal Sheikh) చేతులు, కాళ్లు, శరీరం ఇతర భాగాలు పాలిపోయాయి. దీనికి తోడు అతనికి తీవ్రమైన జలుబు, దగ్గు లక్షణాలు కూడా మొదలయ్యాయి. స్థానిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందక పోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లలేకపోతున్నారు. ఈ వింత వార్త తెలుసుకుని చుట్టుపక్కల పాఠశాల విద్యార్థులు, స్థానికులు చెరువుల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. కొందరు అతనికి అటుకులు, బిస్కెట్లు వంటి ఆహారం అందిస్తున్నా.. నీటి లోంచి బయటకు వచ్చేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు.
మూఢనమ్మకమా లేక అరుదైన వ్యాధా?
ఈ ఘటన వెనుక ‘జిన్’ ప్రభావం ఉందంటూ జనాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే, వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇది ‘ఆక్వాజెనిక్ ప్రురిటస్’ (Aquagenic Pruritus) అనే అరుదైన చర్మ సమస్య కావచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయ వైద్య రంగంలో గుర్తింపు పొందిన ఈ వ్యాధి.. మన దేశ అధికారిక అరుదైన వ్యాధుల జాబితాలో లేదు. ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందనే ఆందోళన గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ బాలుడి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలామంది నెటిజన్స్ జాలిపడుతూ అయ్యో పాపం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఐదేళ్లుగా నీటిలోనే బాలుడి జీవితం!
-పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్కి చెందిన ఇక్బాల్ షేక్ (16)కు అరుదైన చర్మవ్యాధి
-ఒళ్లంతా నిప్పులు పోసినట్లు విపరీతమైన మంట
-ఉపశమనం కోసం ఉదయం నుంచి రాత్రి వరకు రోజంతా నీటిలోనే తింటూ గడుపుతున్న బాలుడు
-చివరకు తినడం, తాగడం వంటి నిత్యకృత్యాలు కూడా… pic.twitter.com/3yhvIgNzxj— Kalam Daily (@kalamtelugu) August 10, 2026
Also Read : జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనలు.. కీలక వ్యక్తి అరెస్ట్
Follow Us On : WhatsApp

